ACB Raids: ఏసీబీ వలలో  ఏఈ అధికారి 2024-06-25 16:32:01

న్యూస్ లైన్ డెస్క్: నెల్లూరు జిల్లాలో అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం సొదాలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ -2 ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సబ్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఇంటి ఎలక్ట్రికల్ లైన్ కలెక్షన్ మంజూరుకు బాధితుడు వద్ద నుండి రూ.50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏఈ శివశంకరయ్య ఏసీబీ అధికారులకి చిక్కాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ దాడులు చేశారు. ఏఈ శివశంకరయ్యను అదుపులోకి తీసుకున్న అధికారులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. ఈ సొదాలో నెల్లూరు ఏసిబి డిఎస్పి శిరీష, సిఐలు, శ్రీనివాస్, కిరణ్, ఆంజనేయ రెడ్డి, విజయ్ కుమార్, నెల్లూరు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.