Shadnagar: ఫ్యాక్టరీలో భారీ పేలుడు 2024-06-28 18:51:31

న్యూస్ లైన్ డెస్క్: షాద్‌‌నగర్(Shadnagar)లోని చింతగూడ గ్రామ శివారులో ఓ ఫ్యాక్టరీ(factory)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ గ్లాస్(south glass) ఫ్యాక్టరీలో రియాక్టర్(reactor) పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ఒక్కసారిగా పేలుడు(blast) సంభవించడంతో భారీగా మంటలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ప్రమాదం జరిగిన స్థలంలో శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను హాస్పిటల్(hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు.