మనిషి ప్రేమలో ఎందుకు పడతారో తెలుసా.? 2024-06-28 20:32:10

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది. తల్లికి బిడ్డపై ప్రేమ, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమ ఇలా ప్రేమలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఈ ప్రేమలో అన్ని రకాలుగా ఆస్వాదించి, శారీరకంగా కూడా ఆస్వాదించే ప్రేమ అనేది మరో విధంగా ఉంటుంది.  ఇలా ఏ ప్రేమ అయినా సరే మన శరీరంలో ఉండే కొన్ని హార్మోన్స్ వల్లే పుడుతుందట. దీనివల్లే మనిషి మనసులో ప్రేమ అనే భావం కలుగుతుందని అంటున్నారు.  ముఖ్యంగా ప్రేమ భావం కలగడానికి మనిషిలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ప్రభావమే ఎక్కువగా ఉంటుందట.  మరి అవి  ఏంటి అనే వివరాలు చూద్దాం..

సాధారణంగా ఒకరిపై ప్రేమ పుడుతుంది అంటే అందులో  మెదడు పాత్ర ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రేమ అంటే మనసులోంచి పుడుతుంది అనేది మాత్రం కవితలకు మాత్రమే పరిమితం కానీ, దానికి అసలు కారణం మెదడు అని అంటున్నారు. చాలామంది  ప్రేమలో  కళ్ళతో చూసి మాత్రమే పడతారట. ఆ కళ్ళకు మనకు వారు పర్ఫెక్ట్ అని తెలిపేది మెదడు మాత్రమే. ప్రేమ భావనలు బలపరిచేది న్యూరో కెమికల్ ఇన్ఫ్లుయెన్స్  అంటారు. మనకు ఆ మనిషి పర్ఫెక్ట్ అనిపించినప్పుడు ఈ కెమికల్స్ రిలీజ్ అవుతాయట.

ఆక్సిటోసిన్, సరిటోనిన్, వంటివి ప్రేమభావాలను ఎక్కువగా బలపరుస్తాయట. డొపమైన్ హార్మోన్ కు సుఖ భావనలు కలిగించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆక్సిటోసిన్ అనేది ప్రేమికుల మధ్య గట్టి బంధాన్ని ఏర్పరిచే లక్షణం ఉంటుందట. ఎక్కువగా రొమాంటిక్ భావనలు కలిగినప్పుడు మెదడు ఈ హార్మోన్లను రిలీజ్ చేస్తుందట. వీటి ప్రభావం వల్లే మనకు పర్ఫెక్ట్ అనే వ్యక్తిపై ప్రేమ భావం కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రసాయనాల వల్లే మనిషిలో ప్రేమ భావం పుడుతుందని శాస్త్రవేత్తలు  తెలియజేస్తున్నారు.