Balakrishna: బాలకృష్ణ 109.. టైటిల్ ఇదేనట.!  2024-06-28 18:39:36

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి ఫ్యామిలీ నుంచి  బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటికి ఆరు పదుల వయస్సు దాటిన సినిమాలు చేస్తూ అదరహో అనిపిస్తున్నారు.  కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి అద్భుత మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలుపొందారు బాలకృష్ణ.  

అలాంటి బాలకృష్ణ తాజాగా 109వ చిత్రం చేయబోతున్నారు. అయితే ఈ చిత్రం గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటి ఊర్వశి రౌటేలా నటిస్తున్నారట. అయితే ఎలక్షన్స్ ముందే ఈ సినిమా షూటింగ్ మొదలైంది కానీ ఎలక్షన్స్ వల్ల కాస్త బ్రేక్ పడింది. టిడిపి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి బాలయ్య ఫ్రీ అయిపోయారు. షూటింగ్ స్టార్ట్ అయిందట. అలాంటి ఈ సినిమా టైటిల్ విషయంలో సందిగ్ధం ఏర్పడింది.

సినిమాకు టైటిల్ ఏం పెట్టబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మొదట ఈ మూవీకి వీర మాస్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలింది. అయితే టీజర్ మరియు గ్లింప్స్ లో చెప్పిన విధంగా అసురుడు తరహాలో ఒక టైటిల్ పెట్టే ఛాన్స్ ఉందని తాజా వార్తలు వినిపిస్తున్నాయి.  అంతేకాకుండా డెమోన్ అనే టైటిల్ కూడా ఈ చిత్రానికి బాగుంటుందని  నందమూరి అభిమానులు భావిస్తున్నారట.