Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం 2024-06-27 05:48:04

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని కాప్రా, ద‌మ్మాయిగూడ‌, ఈసీఐఎల్, నేరెడ్‌మెట్‌, కొంప‌ల్లి, జీడిమెట్ల‌, దుండిగ‌ల్, జ‌గ‌ద్గిరిగుట్ట‌, ప‌టాన్‌చెరు, గ‌చ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, మియాపూర్, బేగంపేట్‌, ముషీరాబాద్‌, ఓయూ, తార్నాక‌, సరూర్‌న‌గ‌ర్‌, హయత్ నగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, చార్మినార్, అబిడ్స్, ఉప్పల్, రామంతాపూర్, కుషాయిగూడ, జవహర్నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట, కుత్బుల్లాపూర్, కూకట్పల్లిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస్తున్నాయి. రాష్ట్రంలో మరో వారంరోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. ఇక రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.