అమ్మాయిలు పానీపూరి తింటున్నారా.. అయితే కష్టమే.?

మానవ పుట్టుక మొదలైనప్పుడు మనిషి ఆహారం కోసం ప్రతి రోజు వేటాడేవారు.  అలా వేటాడగా దొరికిన ఆహారాన్ని తల ఇంత తీసుకొని తినేవారు. అలా పరిణామ క్రమంలో ఆహారాన్ని స్టోర్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు.  ఒక్కసారి వేటకు వెళ్లి ఆహారాన్ని దాచుకొని, కాల్చుకొని తినడం అలవాటు చేసుకున్నారు. అలా మెల్లిమెల్లిగా ఆహార పంటలు వేయడం మొదలుపెట్టారు. ఇలా జనరేషన్ మారుతూ మారుతూ అసలు మనం తినే ఆహారంలోనే మార్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. నాలుకకు ఏది రుచిగా అనిపిస్తే దాన్ని మాత్రమే తింటున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-28/1719590701_pani.jpg

న్యూస్ లైన్ డెస్క్: మానవ పుట్టుక మొదలైనప్పుడు మనిషి ఆహారం కోసం ప్రతి రోజు వేటాడేవారు.  అలా వేటాడగా దొరికిన ఆహారాన్ని తల ఇంత తీసుకొని తినేవారు. అలా పరిణామ క్రమంలో ఆహారాన్ని స్టోర్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు.  ఒక్కసారి వేటకు వెళ్లి ఆహారాన్ని దాచుకొని, కాల్చుకొని తినడం అలవాటు చేసుకున్నారు. అలా మెల్లిమెల్లిగా ఆహార పంటలు వేయడం మొదలుపెట్టారు. ఇలా జనరేషన్ మారుతూ మారుతూ అసలు మనం తినే ఆహారంలోనే మార్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. నాలుకకు ఏది రుచిగా అనిపిస్తే దాన్ని మాత్రమే తింటున్నారు.

అది మన శరీరానికి సెట్ అవుతుందా లేదా అనేది ఏమాత్రం ఆలోచించడం లేదు. దాదాపుగా ఒక 60, 70 సంవత్సరాల క్రితం మన తాతలు, ముత్తాతలు కనీసం 100 ఏళ్లకు పైగానే బతికేవారు. అప్పటిదాకా కూడా వారికి షుగర్, బీపీ లాంటి  రోగాలు కూడా వచ్చేవి కావు.  కానీ ప్రస్తుత కాలంలో పుట్టిన పదేళ్ల లోపే అనేక రోగాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం తినే ఫుడ్.  ఇలా మార్కెట్లో ఎక్కువగా ఇష్టపడి తినే ఫుడ్ లలో పానీ పూరికి కూడా ఒకటి.  దీన్ని అమ్మాయిలు అయితే విపరీతంగా లాగించేస్తారు. అలాంటి పానీపూరి తింటే జరిగే అనర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పానీపూరి ఎక్కువగా తినడం వల్ల మనిషిలో ఆకలి మందగిస్తుందట.

జీర్ణక్రియ సమస్యలు ఏర్పడి  అనేక సమస్యల బారిన పడతారట. అంతేకాకుండా ఈ పానీ పూరి తయారు చేయడంలో కొంతమంది వ్యక్తులు కనీస జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల శరీరంలోకి చెడు బ్యాక్టీరియాల్ వెళ్లి మన శరీరాన్ని పాడు చేస్తాయట.  ముఖ్యంగా ఎక్కువగా పానీపూరీ తినే అమ్మాయిలు అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు పడతారట. అంతేకాకుండా టైఫాయిడ్ వంటి వ్యాధులు కూడా పానీ పూరి తినడం వల్లే వస్తాయట. మొత్తానికి పానీపూరి ఎక్కువగా తినడం వల్ల ఇమ్యూనిటీ తగ్గి అనేక రోగాలకు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health pani-puri stamach-problems girls

Related Articles