రేవంత్ అనుచరుల ఆగడాలను రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా.. తమ ఫోన్లను కూడా లాగేసుకున్నారని సరిత తెలిపారు. ఫోన్ తిరిగి ఇవ్వమని అడిగినప్పటికీ వినిపించుకోకుండా తమపై దాడికి పాల్పడ్డారని, తనపై ఒకరు చేయిచేసుకున్నారని సరిత వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో ఆయన అనుచరులు ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. రుణమాఫీ వివరాలపై రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులు విజయారెడ్డి, సరితలు గురువారం ఉదయం కొడంగల్ నియోజకవర్గంలోని రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. అయితే, రైతులతో మాట్లాడుతున్న తమ వద్దకు వెళ్లి రేవంత్ అనుచరులు దాడికి పాల్పడినట్లు సరిత తెలిపారు. దాదాపు 50 మంది యువకులు మహిళా జర్నలిస్టులను ముట్టడించి రైతులతో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారని ఆమె వెల్లడించారు.
ఈ గ్రామానికి జర్నలిస్టులు రాకూడదంటూ.. కెమెరాలను కూడా లాగేసుకున్నారని తెలిపారు. ఏ మీడియా వాళ్లైనా ఎక్కడికైనా వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. అయితే, రేవంత్ అనుచరుల ఆగడాలను రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా.. తమ ఫోన్లను కూడా లాగేసుకున్నారని సరిత తెలిపారు. ఫోన్ తిరిగి ఇవ్వమని అడిగినప్పటికీ వినిపించుకోకుండా తమపై దాడికి పాల్పడ్డారని, తనపై ఒకరు చేయిచేసుకున్నారని సరిత వెల్లడించారు.
ప్రశ్నించినందుకు తనను విచక్షణ రహితంగా ఓ మడుగులో తోసేశారని వాపోయారు. దీన్ని రికార్డ్ చేసేందుకు ప్రయత్నించిన విజయారెడ్డి ఫోన్ కూడా లాగేసుకున్నారని.. ఇప్పటికీ ఫోన్ వాళ్ల దగ్గరే పెట్టుకున్నారని తెలిపారు. దీంతో మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి వంగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలు అని కూడా చూడకుండా తమపై భౌతిక దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్‌లో పేర్కొన్నారు.
రేవంత్ స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ గూండాల దాడి.
వార్తలు కవర్ చేసే స్వేచ్ఛ మన తెలంగాణ జర్నలిస్టులకు లేకుండా పోయింది.
మహిళలు అని చూడకుండా సరిత, విజయ రెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ, ఫోన్లు, కెమెరాలు గుంజుకుని, భౌతిక దాడికి పాల్పడ్డ… https://t.co/PSAvfvMGqg pic.twitter.com/psC0tSuyGr — News Line Telugu (@NewsLineTelugu) August 22, 2024