MONSOON: ఏపీ కి మాన్ సూన్ ...నాలుగు రోజులు భారీ వర్షాలు !

మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్ , నాగాలాండ్ లోని కొన్ని భాగాలకు విస్తరించాయని ఐఎండీ అధికారులు తెలిపారు.


Published May 26, 2025 03:33:00 PM
postImages/2025-05-26/1748254014_monsoon1200sixteennine.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎండలతో అల్లాడిపో000000తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు . నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి రంగం సిధ్ధమైంది. భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం నేడు మరికొన్ని గంటల్లోనే నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకనున్నాయి. ఇది సాధారణ రాక కంటే వారం రోజుల ముందు కావడం గమనార్హం . ఈ మూడు రోజులు గా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.


కేరళ లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇప్పటికే గోవా, కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్ , నాగాలాండ్ లోని కొన్ని భాగాలకు విస్తరించాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇవి రాయలసీమను నేడు పలకరించనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
 

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu rains

Related Articles