vizag stell plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం !

దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి.ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం ఎస్ ఎంఎస్ -2 ప్రకారం , ఎస్ ఎంఎస్ -2 లోని ఒక పైప్ లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీకై మంటలు వ్యాపించాయి. 


Published May 23, 2025 11:05:00 AM
postImages/2025-05-23/1747978582_VSPjpg.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్ -2 విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి.ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం ఎస్ ఎంఎస్ -2 ప్రకారం , ఎస్ ఎంఎస్ -2 లోని ఒక పైప్ లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీకై మంటలు వ్యాపించాయి. 


ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక దళాలు , రెస్క్యూ టీమ్ లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా  వేస్తున్నారు.ప్రమాద తీవ్రత, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu fire-accident vizag

Related Articles