Beer:డైలీ బీరు తాగుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.!

మందు బాబులం మేము మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఈ పాటను కవి ఊరికే రాయలేదు.  మందు కొడితే ఏ మనిషి అయినా మహారాజులా ఫీల్ అవుతారు. అలాంటి


Published Aug 16, 2024 11:51:20 PM
postImages/2024-08-16/1723832480_beer1.jpg

న్యూస్ లైన్ డెస్క్:మందు బాబులం మేము మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఈ పాటను కవి ఊరికే రాయలేదు.  మందు కొడితే ఏ మనిషి అయినా మహారాజులా ఫీల్ అవుతారు. అలాంటి మందుబాబుల్లో చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ తాగుతూ ఉంటారు. ఇందులో కొంతమంది మాత్రం ఎక్కువగా బీరు తాగడానికి ఇష్టపడతారు. మరి ఇలా ప్రతిరోజు బీర్ తాగడం వల్ల  ఆరోగ్యానికి  ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే వివరాలు చూద్దాం.. ముఖ్యంగా బీరు తాగడం వల్ల ఎముకల యొక్క సాంద్రత పెరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా బీరు అనేది స్త్రీ పురుషులు ఇద్దరికీ మేలు చేస్తుందట.

అలాగని ప్రతిరోజు బీరు తాగడం మంచిది కాదట, వారానికి ఒకసారి, రెండుసార్లు తీసుకుంటే మంచిదట. అయితే  ప్రతిరోజు ప్రత్యేకంగా బీరు ఆరోగ్యం చెడిపోతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు కొంతమంది లావు అవ్వాలనుకునేవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు బీరు  మోతాదులో తీసుకొని ఆహారం తింటే మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది బీరు ఎక్కువగా తాగితే హ్యాపీగా నిద్ర పడుతుందని అనుకుంటారు. కానీ అది కొన్నాళ్ల తర్వాత రివర్స్ అయిపోయి నిద్రలేమి సమస్యకు దారితీస్తుందట.  

దీనివల్ల మెదడు సరిగా పనిచేయక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. అంతేకాదు జీర్ణ సమస్యలు, పేగులకు నష్టం, కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే యూరోపియన్ దేశాలు చేసినటువంటి అధ్యయనం ప్రకారం మితమైన బీరు తీసుకోవడం గుండెజబ్బుల ప్రమాదాన్ని 31 శాతం తగ్గిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా మధుమేహ మరియు కోకోనరీ హాట్ థిస్ ఇస్ ప్రమాదానికి కూడా తగ్గిస్తుందట. బీరు తాగడం వల్ల టైప్2 మధుమేహ  వ్యాధి నుంచి బయటపడవచ్చు అని  నిపుణులు  తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-problems alchohal beer daily

Related Articles