గత ప్రభుత్వ హయంలో మద్యం కుంభకోణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: గత ప్రభుత్వ హయంలో మద్యం కుంభకోణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో లిక్కర్ స్యామ్‌పై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ సర్కార్ హయంలో జిగిరిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈడీకి రిఫర్ చేస్తామని సీఎం తెలిపారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తుకు అర్హమైన కేసుగా పేర్కొన్నారు. లిక్కర్ స్యామ్‌లో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయి అని, ఇది భయంకర స్కామ్‌గా సీఎం చంద్రబాబు అన్నారు.
గత ప్రభుత్వం 75% మద్యం ధరలను పెంచిందని, ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రైపొందిచరంటూ మండిపడ్డారు. పాత బ్రాండ్లను తప్పించి.. కొత్త బ్రాండ్లను తెచ్చారన్నారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకూండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లీగల్ లిక్కర్ అమ్మకాల ద్వారా మొత్తం రూ. 3 వేల కోట్లకు పైగా ప్రభుత్వాన్నికి నష్టం వాటిల్లిందని తెలిపారు. ఎంఎన్‌సీ బ్రాండ్లకు చెల్లింపులు పెండింగులో పెట్టి మార్కెట్టులోకి వేరే బ్రాండ్లు తెచ్చారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.