AP: మంత్రి లోకేష్‌ను కలిసిన క్రికెటర్ హనుమ విహారి 2024-06-25 18:44:33

న్యూస్ లైన్ డెస్క్: ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను క్రికెటర్ హనుమ విహారి మంగళవారం మర్యాదపూర్వకంగా క్యాంప్ ఆఫీసులో కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలు, అన్యాయంపై లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వంపై విహారీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విహారి మాట్లాడుతూ తనా టాలెంట్‌ను గత ప్రభుత్వం తొక్కేసిందని, ఒక్క మ్యాచ్ ఆడగానే రిజైన్ చేయాల్సిందే అంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి తనపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపాడు.తనాతో బలవంతంగా రాజీనామా చేయించారని, ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారని తెలిపారు. ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నాని, రాష్ట్రంలో క్రికెట్‌ను ఎంకరేజ్ చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారన్నారు. తిరిగి ఏసీఏ తరపునే ఆడాలని హనుమ విహారి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.