Pawan Kalyan: ఫ్యాన్స్ పై చిరాకు పడ్డ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ !

ఆయ‌న సీరియ‌స్‌గా మాట్లాడుతున్న స‌మ‌యంలో అక్క‌డే ఉన్న కొంద‌రు అభిమానులు "ఓజీ... ఓజీ..." అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ కు కోపం వచ్చింది. 


Published Dec 28, 2024 03:25:00 PM
postImages/2024-12-28/1735379809_673b1fa08b7d4andhrapradeshdeputychiefministerpawankalyan18060281216x9.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ క్రేజ్ చిరాకు తెప్పించింది. మరి రాదా ...సమయం సంధర్భం లేకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే అరుపులు కేకలు డిప్యూటీ సీఎం కు చిరాకు తెప్పించింది. క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో ఎంపీడీఓ జ‌వ‌హ‌ర్‌బాబును ప‌రామ‌ర్శించి మీడియాతో మాట్లాడుతుండ‌గా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. ఆయ‌న సీరియ‌స్‌గా మాట్లాడుతున్న స‌మ‌యంలో అక్క‌డే ఉన్న కొంద‌రు అభిమానులు "ఓజీ... ఓజీ..." అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ కు కోపం వచ్చింది. 


ఇక అరుపులు భరించలేక   "ఏంట‌య్యా మీరు... ఎప్పుడు ఏ స్లోగ‌న్ ఇవ్వాలో మీకు తెలియ‌దు... ప‌క్క‌కు రండి" అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అయితే సుజీత్ డైరక్ష్ లో వస్తున్న పవన్ సినిమా ఓజీ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. డిప్యూటీ సీఎం  గ‌త కొన్ని రోజులుగా గిరిజన ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. శుక్రవారం వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఇవాళల పరామర్మించారు.
 

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu appolitics movies deputycm

Related Articles