గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులను సత్యకుమార్ పరామర్శించారు. డయేరియా ప్రబలడానికి కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఏపీలో డయేరియా(diarrhea) విజృంభిస్తోంది. జగ్గయ్యపేటలో రోజురోజుకీ రోగుల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్(government hospital)లో 40 పథకాలతో ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేశారు. డయేరియా రోగుల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రూరల్ ఏరియాల్లో(rural areas) భారీగా డయేరియా కేసులు నమోదైనట్లు డాక్టర్లు(doctors) తెలిపారు.
దీంతో వాటర్, ఫుడ్ శాంపిల్స్ తీసుకొని అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు మంత్రి సత్యకుమార్(satyakumar) కూడా జగ్గయ్యపేట చేరుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులను సత్యకుమార్ పరామర్శించారు. డయేరియా ప్రబలడానికి కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డయేరియా బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.