అకడమిక్ ఇయర్ మధ్యలో 6200 మంది టీచర్లను తొలగించడం వల్ల ఈరోజువెలది మంది విద్యార్థులు నడిరోడ్డుపై ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: విద్యా సంవత్సరం మధ్యలో 6200 మంది గురుకుల గెస్ట్ టీచర్లను తొలగించడంపై మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను సన్మానించుకునే సంబరాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను రేవంత్ ప్రభుత్వం చదువులు మానేసి ధర్నాలకు దిగేలా చేసిందంటూ ఆయన ట్వీట్ చేశారు. తమ గురువులకు మద్దతుగా గురుకుల విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయమని వెల్లడించారు.
IIT, నీట్, NITల్లో సీట్లు వంటి జాతీయస్థాయి పరీక్షల్లో విద్యార్థులు సీట్లు సాధించేలా వారి వెన్నంటి నడిపించిన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ గెస్ట్ ఫాకల్టీని తొలగించడం గుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. అకడమిక్ ఇయర్ మధ్యలో 6200 మంది టీచర్లను తొలగించడం వల్ల ఈరోజువెలది మంది విద్యార్థులు నడిరోడ్డుపై ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన వెల్లడించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు వెళ్లకుండా వెంటనే తొలగించిన టీచర్లను తిరిగి ధుల్లోకి తీసుకుని విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని ఆయన సూచించారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి కలలుగన్న తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెబుతారు రేవంత్ రెడ్డి? అని హరీష్ రావు ప్రశ్నించారు.