free sand: నేటి నుండే ఫ్రీ ఇసుక విధానం అమలు


ఇసుక నిల్వ కేంద్రాల్లో కూడా ధరలు తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్‌ చెల్లింపులు కూడా అందుబాటులో ఉండనున్నాయని అధికారులు తెలిపారు. గనులశాఖ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు ఇసుక నిల్వల సమాచారం ఉంటుందని తెలిపారు. 


Published Jul 08, 2024 08:06:27 AM
postImages/2024-07-08/1720422069_modi51.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏపీలో నేటి నుండే ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే, ముందుగా 20 జిల్లాలో ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను ముందుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇందులో భాగంగా ఒక వినియోగదారునికి రోజుకు గరిష్ఠంగా 20 టన్నుల ఇసుక తీసుకునే అవకాశం ఉంది. ఇసుక తవ్వకాల ఖర్చు, సీనరేజ్‌ వసూలు చేయనున్నారు. వాగులు, వంకల్లోని ఇసుక ఎడ్లబండిలో తీసుకెళ్లేందుకు కూడా అవకాశం ఇచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. 

ఇసుక నిల్వ కేంద్రాల్లో కూడా ధరలు తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్‌ చెల్లింపులు కూడా అందుబాటులో ఉండనున్నాయని అధికారులు తెలిపారు. గనులశాఖ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు ఇసుక నిల్వల సమాచారం ఉంటుందని తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : ap-news chandrababu andhrapradesh tdp free-sand freesandpolicy- implementation

Related Articles