సోమవారం రోజు భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పురుషోత్తమాయగూడెం, సీతారాం తండా గ్రామాలలోని రోడ్లను, పునరావవాస కేంద్రాలకు తరలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
న్యూస్ లైన్ డెస్క్: సోమవారం రోజు భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పురుషోత్తమాయగూడెం, సీతారాం తండా గ్రామాలలోని రోడ్లను, పునరావవాస కేంద్రాలకు తరలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ పట్టణంలోని బంధం చెరువు, తదితర ప్రాంతాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్‌తో కలిసి పరిశీలించి దెబ్బతిన్న రోడ్లను యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. జనజీవనం స్తంబించకుండా ప్రత్యామ్నాయ దారులలో ప్రజలకు ఇబ్బందులు కలుగాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం కేసముద్రం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి బాధితులు వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, పోలేపాక నాగరాజు, భూక్య అనూష, తదితరులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. నెల్లికుదురు మండలం, రావిరాల గ్రామంలో వరద ప్రభావిత,బాధితులను పరామర్శించి, గ్రామంలోని ప్రాంతాలను పరిశీలించారు. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని, వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చిన సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.