Heavy rainfall: భారీ వర్షాలకు నిండిన ట్యాంక్ బండ్.. సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివెత


Published Sep 01, 2024 09:17:02 AM
postImages/2024-09-01/1725162422_IMG20240901090653640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు వరద నీటితో నిండుతున్నాయి. ఇప్పటికే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకోగా.. నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తి అధికారులు వరద నీటిని వదిలారు.

హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం ఫుల్‌ ట్యాంక్ లెవెల్‌ దాటింది. సాగర్‌ పూర్తి స్థాయి 513.41 మీటర్లు. వరద నీటితో సామర్థ్యానికి మించి నీరు చేరడంతో హుస్సేన్‌సాగర్‌ నుంచి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేశారు.

 గేట్లు ఎత్తివేశారు. 12 గేట్లు 10 అడుగులు, 14 గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. గేట్లు ఎత్తి సాగర్‌ నుంచి 4,65,222 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.

ప్రస్తుతం నాగార్జున సాగర్‌ ఇన్‌ఫ్లో 4,91,792, ఔట్‌ఫ్లో 5,01,014 క్యూసెక్కులు ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 588.90 అడుగులకు వరద నీరు చేరింది.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news rains weather-report weather-update weather-forecast rain-alert cityrains raininhyd cityinrain

Related Articles