Andhra Pradesh: ప్రాణం తీసిన లోన్ యాప్.. పెళ్లి చేసుకున్న నెలకే ఆత్మహత్య !

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను సైతం వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం గుండెలవిసేలా తల్లడిల్లుతోంది.


Published Dec 10, 2024 05:21:00 AM
postImages/2024-12-10/1733829524_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: లోన్ యాప్ దారుణాలకు మరో ప్రాణం బలైపోయింది. కేవలం రెండు వేలు తీసుకున్నందుకు ఏకంగా సూసైడ్ చేసుకునే చేశారు. పెళ్లై ఇంకా 40 రోజులే అయ్యింది.ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను సైతం వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం గుండెలవిసేలా తల్లడిల్లుతోంది.


విశాఖ నగరంలోని మహారాణిపేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహారాణిపేట అంగటిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర (21) అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యా భర్తలు ఇద్దరు చిన్న చిన్న ఉదయోగాలు చేసుకొని బ్రతుకుతున్నారు. నరేంద్ర లోన్‌ యాప్‌ ద్వారా అప్పు తీసుకుని కొంత మేర చెల్లించేశాడు. మరో రూ.2వేలు మాత్రమే బాకీ ఉంది. ఆ డబ్బు ఇప్పటికప్పుడు కట్టాలని లేదంటే మరో వడ్డీతో కట్టాలని టార్చర్ చేశారు. వెంటనే కట్టకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేస్తామని చెప్పేసరికి టెన్షన్ పడ్డాడు. అంతటితో ఆగకుండా మార్ఫింగ్ చేసిన ఫొటోలను అతని కుటుంబసభ్యులకు, భార్యకు పంపించారు.


దీంతో భార్య భర్తను ఈ విషయాన్ని అడిగింది.. లోన్‌ యాప్‌ వాళ్లకు రెండు వేలు చెల్లించాలని చెప్పాడు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న రూ.2 వేలను వెంటనే లోన్ యాప్ నిర్వాహకులకు చెల్లించారు.. అప్పటికే యాప్‌ నిర్వాహకులు మార్ఫింగ్‌ ఫొటోలను నరేంద్ర ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వాళ్లందరికీ పంపించేశారు. దీంతో నరేంద్ర ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sucide harrasment loan-apps money-

Related Articles