మరికొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఎత్తైన పర్వతాలుంటాయి. పైలట్ కు ఆ విషయం అర్ధమయ్యే లోపే ..జరగాల్సిన ప్రమాదాలు జరిగిపోతాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: విమానం నడపం అంత ఈజీ ఏం కాదు. అందుకే కదా..బోలెడు ట్రైనింగ్ ..ఎన్నో రిస్క్ లు తీసుకుంటే కాని విమానం మన చేతికి రాదు. అంత సీనియర్ మోస్ట్ అయినా కొన్ని ప్లేసుల్లో విమానాలు నడపడానికి పైలట్లుకూడా భయపడతారు. కొన్ని ప్రాంతాల్లో విండ్ పవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఎత్తైన పర్వతాలుంటాయి. పైలట్ కు ఆ విషయం అర్ధమయ్యే లోపే ..జరగాల్సిన ప్రమాదాలు జరిగిపోతాయి.
* టిబెట్ మొత్తం పూర్తిగా పర్వతాలతో నిండి ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉండే ఈ టిబెట్ . విమానాలు నడపడానికి మాత్రం చాలా డేంజరస్. టిబెట్ పీఠభూమిని 'ప్రపంచ పైకప్పు' అని కూడా పిలుస్తారు. అందువల్లనే ఏ విమానయాన సంస్థ కూడా టిబెట్ పైనుంచి తమ విమానాలను నడపదు.
* తక్కువ వాయు పీడనం
ఎక్కువ ఎత్తులో వాయు పీడనం తక్కువగా ఉంటుంది. దీని వల్ల విమానాల ఇంజిన్లు సరిగ్గా పని చేయకపోవచ్చు. ఇంజన్లు చక్కగా పనిచేయడానికి వాయుపీడనం చాలా అవసరం. పొరపాటున ఇంజన్ దెబ్బతింటే ..అది చాలా ఖర్చు తో కూడుకున్న పని దీని వల్లే తక్కువ వాయు పీడనం ఉన్న ప్లేసులకు కూడా వెళ్లరు.
* టేక్ ఆఫ్, ల్యాండింగ్ ప్రాబ్లమ్స్..
టిబెట్‌లో చాలా తక్కువ విమానాశ్రయాలు ఉన్నాయి. ఉన్నవి కూడా ఎత్తులో ఉండడం వల్ల విమానాలకు టేక్ ఆఫ్, ల్యాండింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఎత్తైన పర్వతాలను ఎంత జాగ్రత్త గా చూసుకున్నా...పైలట్ కు ప్రాబ్లమ్ అవుతుంది.
* ప్రమాదకర వాతావరణ పరిస్థితులు
టిబెట్‌లో వాతావరణం చాలా ఫాస్ట్ గా మారిపోతుంది.. గాలులు, మంచు తుఫాన్లు, ఉష్ణోగ్రత మార్పులు తరచూ సంభవిస్తుంటాయి. విమానాల రాకపోకలకు ఇలాంటి వాతావరణం చాలా డేంజర్. అందుకే టిబెట్ అనగానే ఆ జోన్ లో విమానాలు నడపరనే టాక్ ఉంటుంది.