Rao Ramesh: తెలుగు ఆర్టిస్ట్ అంటే..మన నిర్మాతలకే అలుసు సార్

అలా కాని చేస్తే భాషపై అవగాహన లేకపోతే కోట ..  ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్స్ దగ్గర దొరికిపోతాం. నిజానికి మంచి ఆర్టిస్ట్ అవ్వడానికి కారణం కూడా ఇదే కావచ్చు.


Published Aug 30, 2024 08:41:00 PM
postImages/2024-08-30/1725030774_RaoRamesh.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగులో ప్రకాశ్ రాజ్ మార్కెట్ పోయిందంటే ఎవరు కారణమో అందరికి తెలుసు. నిజానికి ఇది మంచి విషయం . మన తెలుగులోనే పర్ఫెక్ట్ నటులు దొరకడం చాలా కష్టం. అలా దొరికిన గ్రేట్ ఆర్టిస్ట్ రావు రమేశ్ . ఇంతవరకు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మెయిన్ రోల్స్ చేసిన రీసెంటుగా తాను మెయిన్ లీడ్ గా 'మారుతీనగర్ సుబ్రమణ్యం' చేశారు. రీసెంట్ గా ఈ సినిమా .. "తెలుగులోనే కాదు .. తమిళ, కన్నడ సినిమాల్లో కూడా రావు రమేష్ పేరు మారుమోగిపోతుంది. ఎక్కడ కూడా నేను ప్రామ్టింగ్ తీసుకోను . అలా కాని చేస్తే భాషపై అవగాహన లేకపోతే కోట ..  ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్స్ దగ్గర దొరికిపోతాం. నిజానికి మంచి ఆర్టిస్ట్ అవ్వడానికి కారణం కూడా ఇదే కావచ్చు.


 రెమ్యూనిరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనేదానికి మాత్రం ...తెలుగు వాళ్లంటే మన నిర్మాతలు డబ్బులివ్వరు సార్ ...ఎందుకో ఆ తేడా నాకు అర్ధం కావడం లేదని అన్నారు. అంతేకాదు ...కాల్షీట్స్ ఎక్కువైనా పర్వాలేదు కాని డబ్బులివ్వరు. ఇది తెలుగు నిర్మాతల నైజం అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. 


రెమ్యూనిరేషన్ డిమాండ్ చెయ్యకపోతే ..చాలా కష్టం. అది కూడా చెయ్యకపోతే మరీ లైట్ తీసుకుంటారు. కనుక నేను నాస్థాయికి మించి అడగను. మనవాళ్లు కూడా అడిగినంత ఇచ్చేయరు లెండి...బేరాలు ఆడతారు. సెట్ అయితే చేస్తాను లేదంటే లేదు. నిజంగా క్యారక్టర్ కు నేను అవసరం అయితే బేరాలు ఆడరు కూడా.
 

newsline-whatsapp-channel
Tags : movie-news telugufilmchamber tollywood-producers rao-ramesh

Related Articles