డాక్టర్ల నిర్లక్ష్యంతో పాముకాటుతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి మృతి చెందాడు.
న్యూస్ లైన్ డెస్క్: డాక్టర్ల నిర్లక్ష్యంతో పాముకాటుతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంకు చెందిన మడివాలప్ప అనే రైతు గడ్డివాము వద్ద గడ్డిని పీకి పశువులకు వేసే సమయంలో పాము కాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అమరాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాము కాటు మందులు ఆసుపత్రిలో లేకపోవడంతో ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సిఫార్సు చేశారు. దాంతో కుటుంబ సభ్యులు తిరిగి బాధితున్ని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కాగా, వైద్యులు చికిత్స చేస్తుండగానే మడివాలప్ప ప్రాణలు కోల్పోయాడు. దాంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. అయితే అదే సమయంలో ఆసుపత్రికి ఆకస్మికంగా తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు వద్ద కుటుంబ సభ్యులు గోడు వినిపించారు. ప్రభుత్వం ఆసుపత్రిలో పాముకాటు మందు లేకపోవడం పట్ల, డ్యూటీలోలేని డాక్టర శశిరేఖ సెలవులో ఉన్న లీవ్ లెటర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న డాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో ఫోన్లో మాట్లాడి నిర్లక్ష్యం వహించిన డాక్టర్ల పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.