చేసేవాళ్లంతా బాగా చేస్తున్నారు. కొంతమంది మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ జనాలకు ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సోషల్ మీడియా దయ వల్ల గల్లీ గల్లీకి సెలబ్రెటీస్ క్రియేట్ అవుతున్నారు. సోషల్ మీడియా యప్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. చేసేవాళ్లంతా బాగా చేస్తున్నారు. కొంతమంది మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ జనాలకు ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు. ఇలా ఇబ్బందిపెడుతున్న ఓ మహిళను పోలీసులు వెతుకుతున్నారు. మీ కనిపిస్తే చెప్పండంటున్నారు పోలీసులు.
ఓ మహిళ నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాదకరంగా డ్యాన్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా చేస్తుందట. ఒక్కసారి కాదు పదే పదే ఇదే చేస్తుండడంతో ..ఈమె కోసం పోలీసులు వెతుకుతున్నారు.. నడిరోడ్డుపై డ్యాన్స్ లు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. యూపీలో ఓ మహిళ వర్షం పడుతుండగా నడి రోడ్డుపై డ్యాన్స్ చేసింది. వెనుక వెహికల్స్ అన్ని ఆగిపోయి ..జనాలు తడుస్తున్నారు . అయినా మహిళ పట్టించుకోదే..దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వర్షంలో తడుస్తూ నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిందో మహిళ. వేగంగా వాహనాలు వస్తున్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా డ్యాన్స్ చేసింది. అసలే వర్షం ...వెహికల్స్ లో వెళ్లే వారికి డ్రైవింగ్ కష్టం..అలా అని మహిళ ఏమైనా పక్కకు పోయి డ్యాన్స్ వేస్తుందా అంటే అదీ లేదు. రోడ్డు మధ్యలో పిచ్చి గంతులు వేస్తూ జనాలను ఇబ్బందిపెట్టడంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమె కారు నంబరును పంపాలని కోరారు. ఆమెపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. సో మీకు కాని కనిపిస్తే పాపం పోలీసులకు అంట చెప్పండి.
रील बनाने का भूत अब भाभियों और आंटियों को ज्यादा चढ़ रहा है ,
Tags : newslinetelugu rains social-media uttarpradesh viral-video