ANR: ANR చేసిన పనికి మద్రాస్ లో సాంబార్ గాడు అనేవారట ?

రైల్వేస్టేషన్ లో ఏదో నాటకానికి వెళ్తుండగా ఘంటసాల బాలరామయ్య గారు చూసి సినిమాలకు పనికొస్తాడని మద్రాస్ తీసుకొచ్చారట.పుల్లయ్య దర్శకత్వం వహించిన `ధర్మపత్ని` చిత్రంలో బాలనటుడిగా తీసుకున్నారు.


Published Sep 20, 2024 01:54:00 PM
postImages/2024-09-20/1726820720_sddefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏఎన్నార్ సినిమాలంటే అప్పట్లో యమక్రేజ్ . సుమారు ఏడు దశాబ్ధాల పాటు సినిమా రంగంలో ఉన్నారు. 1941 లో ధర్మపత్ని సినిమా నుంచి 2014 వచ్చిన మనం వరకు నటిస్తూనే ఉన్నారు. ఎన్నో రకాల పాత్రలు చేవారు. పౌరాణికాలు, జానపదాలు అన్ని రకాల సినిమాలు చేశారు.దాదాపు 256 సినిమాలు చేశారు.
అయితే కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. రైల్వేస్టేషన్ లో ఏదో నాటకానికి వెళ్తుండగా ఘంటసాల బాలరామయ్య గారు చూసి సినిమాలకు పనికొస్తాడని మద్రాస్ తీసుకొచ్చారట.పుల్లయ్య దర్శకత్వం వహించిన `ధర్మపత్ని` చిత్రంలో బాలనటుడిగా తీసుకున్నారు.


తర్వాత కొన్నాళ్లకు ఘంటసాల బలరామయ్య తీసిన `సీతారామ జననం` చిత్రంలో మెయిన్‌ హీరోగా పరిచయం చేశాడు. ఇక అప్పట్నుంచి  ఏఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ వంటి మెయిన్‌ స్ట్రీమ్‌ నటులు రాలేదు. మొదట్లో 250 రూపాయల జీతం ఇచ్చేవారట. నెలకు ఆ మొత్తం ఇచ్చే వారని తెలిపారు ఏఎన్నార్‌. ఓ రూమ్‌ ఇచ్చి, భోజనం పెట్టి ఆ అమౌంట్‌ ఇచ్చేవారట. మనకేమైనా తినాలనిపిస్తే ఇక ఆ డబ్బులో ఖర్చుపెట్టాల్సిందే. అయితే తన ఖర్చులు కోసం 50 రూపాయిలు ఉంచుకొని మిగిలినవి ఇంటికి పంపించేవారట.

తనకు మద్రాస్‌లోని పాండీ బజార్‌లో ఓ హోటల్‌లో టిఫిన్‌ బాగుండేదట. రెండు ఇడ్లీ సరిపోయేవి కాదు. మరో రెండు ఇడ్లీ తిందామంటే డబ్బు అయిపోతుందనే కంగారు. అందుకే రెండు ఇడ్లీలకు కనీసం పది గరిటెల సాంబారు వేసుకొని తినేసేవాడిని . అలా నాలుగు ఐదు సార్లు చేసేసరికి హోటల్ వాడు ..వీడు పెద్ద సాంబార్ గాడిలా ఉన్నాడురా అని తిట్టేవాడట. అయినా నేనేం అనుకునేవాడిని కాదు..హ్యాపీగా తినేసేవాడిని . 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu anr akkineni-family chennai

Related Articles