Ashada Amavasya : రేపే ఆషాడ అమావాస్య ..పుష్యమి నక్షత్రం కూడా ...!

తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఆదివరం ఆషాఢ అమావాస్య ..దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటుంటారు.


Published Aug 03, 2024 09:40:00 AM
postImages/2024-08-03/1722658257_amavasya.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఆదివరం ఆషాఢ అమావాస్య ..దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటుంటారు. ముఖ్యంగా రైతులు మొక్కలు నాటడానికి అనువైన కాలమని పెద్దలు చెబుతుంటారు. అసలు ఆదివారం అమావాస్య ఓ పట్టు అయితే ...మరో వైపు పుష్యమి నక్షత్రం ఆదివారం కలవడం మరో పట్టు. 


హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణాలు సమర్పిస్తే, అద్భుత ప్రయోజనాలు పొందుతారని, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఈ ఆదివారం అమావాస్య వచ్చింది. దక్షిణాయానం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య ఇదే. అయితే ఈ అమావాస్య వేళ కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు.  


ఈ రోజున పెద్దలకు , చనిపోయిన వారిని తలుచుకొని ..వారి తర్పణాలు వదలకడం వల్ల పితృదోషాలు కలగవు . అంతేకాదు పుష్యమి నక్షత్రం కలవడం వల్ల దాన ధర్మాలు చెయ్యాలి. మొక్కలు నాటాలి. ఏ దేవున్నైనా తలుచుకొని పూజలు చేస్తే ..దీని ఫలం డబుల్ దక్కుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.


ఈ ఏడాది 3 ఆగస్టు 2024 శనివారం మధ్యాహ్నం 3:31 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది.మరుసటి రోజు 4 ఆగస్టు 2024 ఆదివారం మధ్యాహ్నం 3:54 గంటల వరకు ఉంటుంది. ఇదే రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు ఎవ్వరిని హింసించడం కాని ..ఎవ్వరిని ఇబ్బందిపెట్టడం చెయ్యకండి. కోరి కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్టే అవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu lakshmi ram-narayana pooja

Related Articles