దేశంలోకెల్లా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన NEET లో సత్తా చాటాడు. ప్రస్తుతం తన లాంటి లక్షలాది పేదవారికి ఆదర్శంగా నిలిచాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : అతనో రోజు కూలి...ఇటుకలు మోస్తే కాని కడుపు నిండదు. చాలా పేద కుటుబంలో పుట్టాడు. కాని తల రాతను మార్చుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించి దేశంలోకెల్లా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన NEET లో సత్తా చాటాడు. ప్రస్తుతం తన లాంటి లక్షలాది పేదవారికి ఆదర్శంగా నిలిచాడు.
వెస్ట్ బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల రోజువారీ కూలీ సర్ఫరాజ్, రోజుకు కేవలం రూ. 300 సంపాదిస్తూ, నీట్ 2024 పరీక్షలో 720కి 677 స్కోర్‌ను సాధించాడు. అయితే డాక్టర్ కావాలనేది తన కల. ఇటుక రాళ్లు మోస్తే కాని కడుపునిండదు అదీ అతని కుటుంబపరిస్థితి పొద్దున్నే 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కష్టపడి పని చేసి మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా చదువుకునేవాడు. యూట్యూబ్ లో అలఖ్ పాండే NEET వీడియోలు చూస్తూ ప్రిపేర్ అయ్యాడు. సరైన పైకప్పు లేని తన ఇంట్లోనే చదువుకున్నాడు.
NEET 2024లో ఉత్తీర్ణత సాధించిన సర్ఫరాజ్ కోల్‌కతాలోని నిల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాడు. తన సంకల్పానికి అలఖ్ పాండే ఫిదా అయ్యాడు. సర్ఫరాజ్ కు డాక్టర్ చదువుకోవడానికి తన సయాం తను చేస్తానని హామీ ఇచ్చాడు.అతనికి కొత్త స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇంకా అతని చదువు కోసం 5 లక్షల అప్పుగా ఇచ్చాడు. ఇలా కష్టాలు వేధిస్తున్నా కూడా క్రుంగి పోకుండా కష్టపడి చదివి NEET క్లియర్ చేశాడు సర్ఫరాజ్. అయితే ఈ 5 లక్షల అప్పు తనకు ఉద్యోగం వచ్చాక ఇవ్వాల్సిందిగా తెలిపాడు.