Food Adulteration: :కల్తీ ఆహారాన్ని అమ్మితే కఠిన శిక్షలు తప్పవు !

కల్తీ ఆహారం రోజు రోజుకు చాలా ఎక్కువైపోతుంది.అందుకే కల్తీ ఆహారం అమ్మేవారికి కఠిన శిక్షలు అమలు చెయ్యాలని ఫిక్స్ అయ్యింది. 


Published Nov 22, 2024 10:32:00 PM
postImages/2024-11-22/1732295031_01.vedikaphotodamodarm.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  మార్కెట్లో ఏది కొనాలన్నా భయమేస్తుంది. పాల నుంచి ఉప్పు వరకు అన్నీ కల్తీనే. అసలు సరైన ఆహారం తీసుకోకపోతే కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయని తెలిసినా తింటారు. అయితే తినే వాళ్లు ఉంటే అమ్మేవాళ్లకి కొదవేముంది. రుచి గా ఉండాలని ఏమూనా కలుపుతారు. రంగులు..టేస్టింగ్ సాల్ట్ అన్నీ ...అయితే కల్తీ ఆహారం రోజు రోజుకు చాలా ఎక్కువైపోతుంది.అందుకే కల్తీ ఆహారం అమ్మేవారికి కఠిన శిక్షలు అమలు చెయ్యాలని ఫిక్స్ అయ్యింది. 


మనదేశంలో ఆహార భద్రత, నాణ్యత చట్టం కూడా తయారుచేశారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కూడా కల్తీ ఆహారాలపై కొరడా విసరుతుంది. అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్తున్నపుడు ఎట్టి పరిస్థితుల్లోను ..ఓపెన్ గా మీ ముందు వాడిన ఆహారాన్నే తినండి. ఓపెన్ కిచెన్స్ ఉంటాయిగా వాటిలో తినండి. అంతేకాదు..ఆయిల్ రంగు నీట్ గా ఉండాలి. ఫుడ్ లో రంగులు వాడకూడదు. టేస్టింగ్ సాల్ట్ కూడా వాడకూడదు.


నేరారోపణపై జరిమానా, శిక్ష.. ఒక్కోసారి రెండూ విధించవచ్చు. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే, అటువంటి కేసులకు 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష విధిస్తారు. కల్తీ ఆహారం తిన్న వ్యక్తి మరణిస్తే, కల్తీ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. దీని ప్రకారం మీరు కాని ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోనైనా కల్తీ జరుగుతుందని తెలిస్తే పోలీసులకు పిర్యాధు చెయ్యండి.ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయడం, మంచి జీవనశైలిని అవలంబించడంతో పాటు, ఆహార ఎంపికలు కూడా చాలా ముఖ్యమైనవి. మాంసాహారం అతిగా తినకండి. కాస్త కూరగాయల్లో ఉప్పు తగ్గించి...ఆయిల్ వాడడం బాగా తగ్గించండి. కార్డియో చెయ్యండి. దీని వల్ల మీరు హెల్దీ గా ఉండవచ్చు.
 

newsline-whatsapp-channel
Tags : food-safety healthy-food-habits junk-food fake-oil-

Related Articles