సాధారణంగా చాలామంది ప్రజలకు వచ్చే జబ్బుల్లో జ్వరం, తలనొప్పి, జలుబు కామన్. ఇవి వచ్చాయి అంటే తప్పనిసరిగా ఏదైనా మెడికల్ షాప్ కు వెళ్లి కొన్ని రకాల టాబ్లెట్లు తెచ్చుకుంటూ ఉంటాం. దీంతో ఆ మెడికల్ షాప్ యజమానులు కొన్ని రకాల టాబ్లెట్లు ఇస్తారు వాటిని మనం వేసుకుని ఉపశమనం పొందుతాం. వారిచ్చే టాబ్లెట్లలో కొన్ని టాబ్లెట్లు చాలా డేంజర్ అట. మనం రోగాన్ని తగ్గించడం కాదు అది రాబోవు రోజుల్లో రోగాలని పెంచేస్తుందట. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది.
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా చాలామంది ప్రజలకు వచ్చే జబ్బుల్లో జ్వరం, తలనొప్పి, జలుబు కామన్. ఇవి వచ్చాయి అంటే తప్పనిసరిగా ఏదైనా మెడికల్ షాప్ కు వెళ్లి కొన్ని రకాల టాబ్లెట్లు తెచ్చుకుంటూ ఉంటాం. దీంతో ఆ మెడికల్ షాప్ యజమానులు కొన్ని రకాల టాబ్లెట్లు ఇస్తారు వాటిని మనం వేసుకుని ఉపశమనం పొందుతాం. వారిచ్చే టాబ్లెట్లలో కొన్ని టాబ్లెట్లు చాలా డేంజర్ అట. మనం రోగాన్ని తగ్గించడం కాదు అది రాబోవు రోజుల్లో రోగాలని పెంచేస్తుందట. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది.
ఇందులో ముఖ్యంగా జలుబు, జ్వరం, నొప్పులు ఎలర్జీలకు సంబంధించిన ఈ మందులను తొలగించనుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పారాసెటమాల్ 125 ఎంజి, అలాగే ఎసెక్లోపెనాల్ 500 ఎంజి, మెఫైనమిక్ యాసిడ్+ పారాసెటమాల్ ఇంజక్షన్, సెట్రీజన్ హెచ్సీఎల్+ పారాసెటమల్ + పినైలెఫ్రేన్ హెచ్ సిఎల్+ పారాసెటమాలు వంటివి నిషేధిత మందుల జాబితాలోకి వచ్చాయి.
ఈనెల 12న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి కంటే సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉన్నాయని, వాటిని వాడకుండా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అని వారు తెలియజేసారు. అందుకే వీటిపై నిషేధం పడిందని, ఇకనుంచి ఈ మందులు మార్కెట్లో అందుబాటులో ఉండవని తెలియజేశారు.