దేవర సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి అద్భుతమైన రికార్డు దిశగా దూసుకుపోతోంది. అలాంటి దేవర చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్ చేశారు. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం మొత్తం 7 రోజుల్లో ఎంత
న్యూస్ లైన్ డెస్క్: దేవర సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి అద్భుతమైన రికార్డు దిశగా దూసుకుపోతోంది. అలాంటి దేవర చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్ చేశారు. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం మొత్తం 7 రోజుల్లో ఎంత కలెక్షన్ చేసింది ఆ వివరాలు ఏంటో చూద్దాం.. దేవర మూవీ విడుదలై వారం కాకముందే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది.
దాదాపు రూ:300 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం యువసుధా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు. అలాంటి ఈ చిత్రం నైజాంలో 44 కోట్లు, సీడెడ్ లో 22 కోట్లు, ఆంధ్రాలో 46 కోట్లు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 112.55 కోట్లు రిలీజ్ చేసి అద్భుతంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇతర రాష్ట్రాలైన తమిళనాడులో 6 కోట్లు, కర్ణాటకలో 16 కోట్లు, కేరళలో దాదాపు రెండు కోట్లు, మొత్తం ఓవర్సీస్ లో 27 కోట్లు సాధించిందట.
ఇక ఇండియా మొత్తం కలిపి 20కోట్లు కలుపుకొని 182.55 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.ఇక ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయింది. మొదటిరోజు 1072 కోట్లు, రెండవ రోజు 71 కోట్లు, మూడవరోజు 40 కోట్లు, నాలుగవ రోజు 25 కోట్లు, ఐదవ రోజు 40 కోట్లు, ఆరవ రోజు 40 కోట్లు, ఏడవ రోజు సాయంకాల సమయానికి 396 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం అందుతుంది.
ప్రస్తుతం దసరా సెలవులు ఉండడంతో ఈ చిత్రం ఇంకా కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చింది ఒక లెక్క అయితే ఇకముందు వచ్చే లెక్క మరో విధంగా ఉంటుందని సమాచారం అందుతుంది. ఈ దసరా సెలవుల్లో ఈ చిత్రం అద్భుతంగా దూసుకెళ్తే మాత్రం ప్రభాస్ రికార్డులు మొత్తం బద్దలయ్యే అవకాశం ఉంది. సినిమా యూనిట్ అంచనాల ప్రకారం దాదాపు 800 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.