ఇప్పుడు 24 క్యారట్ల ప్యూర్ గోల్డ్ 78,960 గా తగ్గి రూ.78,960గా ఉంది. బుధవారం కిలో వెండి ధర రూ.97,040గా ఉండగా, గురువారం నాటికి రూ.4,025 తగ్గి రూ.93,015గా ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం ,వెండి ధరలు తగ్గాయి. నిన్న మీద ఈ రోజు బంగారం రెండు వేల ముప్పై రూపాయిలు తగ్గాయి. ఇప్పుడు 24 క్యారట్ల ప్యూర్ గోల్డ్ 78,960 గా తగ్గి రూ.78,960గా ఉంది. బుధవారం కిలో వెండి ధర రూ.97,040గా ఉండగా, గురువారం నాటికి రూ.4,025 తగ్గి రూ.93,015గా ఉంది.
దాదాపు గా ..అన్ని తెలుగు రాష్ట్రాల్లోను ఇదే ధర ను మెయింటైన్ చేస్తున్నారు. అయితే జీఎస్టీ తో పాటు షో రూమ్ ఛార్జీలతో కాస్త ఎక్కువవుతుంది. అంతేకాదు దీపావళి, ధంతేరాస్ తో పోలిస్తే బంగారం ధర దాదాపు 6 వేల దగ్గర తగ్గింది. అయినా ఇంకా మిడిల్ క్లాస్ వారికి అందుబాటులో లేని ధరే నడుస్తుంది..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం వల్ల బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో దూసుకెళ్లిన సూచీలు గురువారం నష్టాల్లోకి జారుకున్నాయి. దీని ఎఫెక్ట్ కూడా బంగారం పై పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.