బ్యాంకులు మెర్జ్ సంగతి మళ్లీ మొదలుపెట్టారు.కేంద్రప్రభుత్వం మరోసారి బ్యాంకులను మెర్జ్ చెయ్యాలనే ఆలోచనలు చేస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బ్యాంకులు మెర్జ్ సంగతి మళ్లీ మొదలుపెట్టారు.కేంద్రప్రభుత్వం మరోసారి బ్యాంకులను మెర్జ్ చెయ్యాలనే ఆలోచనలు చేస్తుంది. 43 బ్యాంకులను 28 కి చేయాలనుకుంటుంది. దీంతో ఇక పై దేశం మొత్తం మీద 15 బ్యాంకులు మూతపడనున్నాయి.దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకులను మెర్జ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుం దేశంలో మొత్తం 43 గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ సంఖ్యను 28కి తగ్గించాలనుకుంటుంది.
ప్రతి రాష్ట్రంలో ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రూరల్ బ్యాంకులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో మూడు RRBలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, బీహార్, ఒడిశా, రాజస్థాన్‌లలో రెండు RRBలు ఉన్నాయి. ఉత్తరాఖండ్, త్రిపుర, తెలంగాణ, కేరళ లో బ్యాంకులను ట్రిమ్ చేశాద్దామనుకుంటుంది కేంద్రప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి చైతన్య గోదావరి, సప్తగిరి, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. తెలంగాణ లో అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఒకటే ఉంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ బ్యాంకులకు ఎస్పీఐ స్పాన్సర్ చేస్తుంది.ఇప్పటికే మెర్జ్ కానున్న బ్యాంకుల అధిపతులను కేంద్ర ఆర్థిక సేవల విభాగం అభిప్రాయాలు కోరింది. వీటిని ఈ నెల అంటే నవంబర్ 20 నాటికి తెలపాలని కోరింది. ఇందులో మీ బ్యాంకు ఉందేమో చూసుకొండి.