gold: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

బంగారం ధర రూ.81,170 ఉండగా ఆదివారం మరో వంద పెరిగి 81,270 కు చేరుకుంది. దీపావళి ఎఫెక్ట్ తో బంగారం ధర మరింత పెరిగే అవకాశముంది.


Published Oct 27, 2024 11:13:00 AM
postImages/2024-10-27/1730008181_goldandsilverprice11.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.81,170 ఉండగా ఆదివారం మరో వంద పెరిగి 81,270 కు చేరుకుంది. దీపావళి ఎఫెక్ట్ తో బంగారం ధర మరింత పెరిగే అవకాశముంది. 22 క్యారట్ల బంగారం ధర 78వేల ఛేంజ్ నడుస్తుంది. అయితే అన్ని రాష్ట్రాల్లోను ఈ ధర ఇలానే నడుస్తుంది. 


ఆల్ మోస్ట్ తెలుగు రాష్ట్రాలన్నింటిలోను ఇదే ధర నడుస్తుంది. బంగారం అదే విజయవాడ , గుంటూరు, తూర్పుగోదావరి , రాజమండ్రి , విశాఖ జిల్లాల్లో మాత్రం తులం బంగారం దాదాపుగా 90 వేలకు దగ్గర గా ఉన్నట్లు తెలుస్తుంది. వీరికి తులం బంగారం 11.650 మిల్లీగ్రాములు దీని కారణం తులం 90 వేలకు చేరువగా ఉంటుంది.


ఇక వెండి ధర 99 వేల 650 రూపాయిలు గా ఉంది.  మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ధనత్రయోదశి కారణంగా వెండి , బంగారు ఆభరణాలు కొనుగోలు మరింత పెరుగుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లోను వెండి , బంగారంపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. సో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు ఎనలిస్టులు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business gold-rates silver-rate stock-market

Related Articles