jammu And Kashmir: రణరంగంగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ..కాలర్లుపట్టుకున్న ఎమ్మెల్యేలు !

ఆరేళ్ల తర్వాత తొలిసారి సోమవారం జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగో రోజైన నేడు అసెంబ్లీలో ఘర్షణ వాతావఆర్టికల్ 370ని పునరుధ్దరించాలంటూ జైలు పాలయిన బారాముల్లా లోక్ సభ ఎంపీ ఇంజినీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ బ్యానర్ ప్రదర్శించారు. రణం నెలకొంది.


Published Nov 07, 2024 01:56:07 AM
postImages/2024-11-07/1730965221_jammu.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ గురువారం  యుధ్ధంలా మారింది. ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆర్టికల్ 370ని పునరుధ్దరించాలంటూ జైలు పాలయిన బారాముల్లా లోక్ సభ ఎంపీ ఇంజినీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ బ్యానర్ ప్రదర్శించారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఉద్రిక్తత మొదలయ్యింది.


ఆరేళ్ల తర్వాత తొలిసారి సోమవారం జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగో రోజైన నేడు అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పునరుద్దరించేందుకు కేంద్రప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలంటూ నిన్న సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ రోజు సభ స్టార్టింగ్ నుంచే చర్యలు , ఘర్షణలు జరుగుతున్నాయి.పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) తాజాగా నేడు కూడా ఆర్టికల్ 370, 35(ఏ) ని పునరుద్ధరించాలంటూ తీర్మానాన్ని ప్రతిపాదించింది. బీజేపీ సభ్యులు దీనికి ఒప్పుకోలేదు . ఇక్కడ మొదలైంది రచ్చ.


ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌శర్మ ఈ తీర్మానంపై మాట్లాడుతుండగా.. అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ వెల్‌లోకి దూకి బ్యానర్ ప్రదర్శించారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ సభ్యులు చాలా మంది ఆ బ్యానర్ లాక్కొని చించిపడేశారు. దీంతో ఒకరిని ఒకరు కొట్టుకునే వరకు వెళ్లింది. దీనిపై స్పీకర్ అబ్దుల్ రహీం సభ ను వాయిదా వేయడమే కాకుండా ఇలాంటి పరిస్థితిని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదని ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాలని కోరారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు ..బీజేపీ పార్టీ దీనిని సమర్ధించలేదు కాని లోకల్ పార్టీస్ ఈ తీర్పును సమర్ధించారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jammu-kashmir bjp

Related Articles