trump: భారత్‌పై ట్రంప్‌ 2.0 ప్రభావమెంత? వీసాలు, విద్యార్ధుల భవిష్యత్తు ఎలా ఉంటుంది ?

ఒకరికి ఒకరు సాయం లేకపోతే  ఎలా కాని కొంత మంది అధ్యక్షుల వల్ల  దేశాలకు ఎక్కువ మేలు జరుగుతుంది..చూద్దాం ట్రంప్ సార్ వల్ల ఎలాంటి మంచి జరుగుతుందో . 


Published Nov 07, 2024 10:06:00 AM
postImages/2024-11-07/1730954425_Election2024Trump19017308847154551730884740324.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఖరారైంది. అయితే అగ్రరాజ్యం అధక్షుని వల్ల  మన దేశానికి కలిగే నష్టాలేంటి.. .ఉపయోగాలేంటి. ప్రతి దేశానికి పొరుగు దేశంతో కొన్ని దౌత్యపరమైన సంబంధాలుంటాయి. ఒకరికి ఒకరు సాయం లేకపోతే  ఎలా కాని కొంత మంది అధ్యక్షుల వల్ల  దేశాలకు ఎక్కువ మేలు జరుగుతుంది..చూద్దాం ట్రంప్ సార్ వల్ల ఎలాంటి మంచి జరుగుతుందో . 


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడం భారత్ కు మంచిదే. 2016లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారత్‌ పట్ల సానుకూల వైఖరిని ట్రంప్‌ కనబర్చటం వల్ల చాలా మంది భారతీయులు ట్రంప్ వైపు ఎక్కువ ఇంట్రస్ట్ చూపించారు.  అయితే ఇప్పుడు మళ్లీ పదవిలోకి వచ్చారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడు అయినపుడు కాస్త పాజిటివ్ రియాక్షన్ వచ్చింది.నిజానికి ట్రంప్ వచ్చినపుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలపడంది. ట్రంప్‌ తొలి విడతలో హౌడీ మోదీ, నమస్తే ట్రంప్‌ వంటి రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈసారి ట్రంప్‌ 2.0లో కూడా ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సైనిక సంబంధాలు, ఇమ్మిగ్రేషన్‌, దౌత్య సంబంధాలు ఇంకా బలపడే అవకాశాలున్నాయి.
ట్రంప్‌ మొదటి నుంచి చైనా పట్ల చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అది ఓపెన్ సీక్రెట్ . నిజానికి చైనా ప్రాడెక్ట్స్ అన్నీ చాలా వరకు అమెరికా బిజినెస్ చేస్తుంది. ఈ సారి చైనాపై ట్రంప్ టారిఫ్ యుద్దం మరోసారి మొదలుపెట్టే ఛాన్సు ఉన్నాయి. అదే కాని జరిగితే భారత్ సంస్థలకు మరింత అభివృధ్ధి జరుగుతుంది.


ప్రధానంగా టెక్స్‌టైల్స్‌, ఆటోమొబైల్‌ విడిభాగాలు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు అమెరికా మార్కెట్లోకి బలంగా వెళ్లేందుకు మార్గం లభిస్తుంది. అదే  సమయంలో ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్‌ రావడం రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత వాణిజ్య విధానాలు అమెరికాకు నష్టం చేకూరుస్తున్నాయంటూ ట్రంప్‌ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ట్రంప్‌ 2.0 హయాంలో వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయని, ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతాయనే అంచనాలు ఉన్నాయి. 


ట్రంప్‌ విద్యుత్తు వాహనాలకు ఇన్సెంటివ్‌లను తగ్గించే అవకాశాలుండటం వల్ల భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే వాటి స్పేర్‌పార్టులపై స్వల్పకాలం పాటు ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ముడిచమురు, గ్యాస్‌ ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలు తగ్గవచ్చు. రెండోసారి పదవీకాలంలోనూ రక్షణ రంగంలో సహకారం మరింత పెరిగే అవకాశం ఉంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america india pm-modi

Related Articles