అక్కడ ఎన్నికల్లో తాను గెలిస్తే పార్లితోని సింగిల్స్ అందరికి పెళ్లిళ్లు జరిపిస్తానని ఆ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్నో చెబుతుంటారు. కొన్ని దేశానికి, జనాలకి ఉపయోగపడేవి కొన్ని హామీలు ఇస్తుంటారు. అయితే రీసెంట్ గా మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఎన్సీపీ నేత రాజేసాహెబ్ దేశ్ ముఖ్ భలే వింత హామీ ఇచ్చారు. బీడ్ జిల్లాలో పార్లి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అక్కడ ఎన్నికల్లో తాను గెలిస్తే పార్లితోని సింగిల్స్ అందరికి పెళ్లిళ్లు జరిపిస్తానని ఆ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
పార్లీ అబ్బాయిలకు ఉద్యోగాలున్నాయా? లేదంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? అని పెళ్లికి ముందు పెద్దలు ఆరా తీస్తున్నారని, ప్రభుత్వం ఇవ్వకుంటే ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఉద్యోగ కల్పనను పట్టించకోకపోతే బ్యాచిలర్లు ఏం చేస్తారు. తను గెలిస్తే సింగిల్స్ కు పెళ్లిళ్లు కల్పించి తీరుతానని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
మరాఠ్వాడాలో యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని, గత దశాబ్దకాలంగా ఇక్కడ ఉద్యోగం అన్న మాటే లేదని పేర్కొన్నారు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేకపోవడం సామాజిక సమస్యగా మారిందని పేర్కొన్నారు. కాబట్టి యువతకు పెళ్లిళ్లు జరిపిస్తామని ఎవరైనా హామీ ఇస్తే అందులో తప్పేమీ లేదన్నారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి హామీలపై నెటిజన్లు నవ్వుకుంటున్నారు.