ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. పత్తి వేసిన రైతులకు ఈ ధర పెరగడం ఆనందాన్నిస్తోంది. అయితే ఈ ఏడాది చాలామంది రైతులు ఎక్కువ మొత్తంలో పత్తిని సాగు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. పత్తి వేసిన రైతులకు ఈ ధర పెరగడం ఆనందాన్నిస్తోంది. అయితే ఈ ఏడాది చాలామంది రైతులు ఎక్కువ మొత్తంలో పత్తిని సాగు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల పత్తి పంట కాస్త దెబ్బ తినే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఈ మూడు రోజులొస్తుంది వానలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి మళ్లీ రైతులు పత్తిని ఎలాగైనా పుంజుకునేలా చేస్తారు.
అలాంటి పత్తివేసినటువంటి రైతులకు ఉన్నటువంటి ధర కాస్త ఊరట నిస్తోందని చెప్పవచ్చు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో జమ్మికుంట మార్కెట్ లో ఖరీఫ్ సీజన్ తెల్ల బంగారానికి రికార్డు ధర పలికినట్టు తెలుస్తోంది. గత వారం రోజుల నుంచి నిలకడగా ఉన్నటువంటి ఈ ధరలు బుధవారం రోజున అమాంతం పెరిగిపోయాయి. క్వింటాల్ కు రూ:7800 ప్రైవేట్ వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారట. ఇదే తరుణంలో వివిధ జిల్లాల నుంచి జమ్మికుంట మార్కెట్ కు పత్తి రావడంతో వ్యాపారులు అత్యధిక ధర పెట్టి దాన్ని కొనుగోలు చేశారు.
పత్తి గరిష్ట ధర రూ:7,800, కనిష్ట ధర 7400, మిడిల్ ధర రూ:7600 ఉంది. అయితే ఖరీఫ్ సీజన్ నుంచే ఈ పత్తి ధరలు 7000 నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. కానీ తాజాగా ఈ ధర 400 అమాంతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ఇలా పత్తి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ లో పత్తి గింజలకు మరియు పత్తికి ఆదరణ పెరిగిపోవడంతో ధరలు పెరిగిపోయాయని వ్యాపార వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి ఈ ధర ఇలాగే నిలకడగా ఉంటే మాత్రం ఇప్పుడు పత్తి సాగు చేసిన రైతులకు లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు.