ఏడాదంతా చిన్న నెయ్యి దీపం వెలుగుతూనే ఉంటుంది. అయినా నెయ్యి తరగదు. ప్రసాదం పెడతారు కదా... ఆ ప్రసాదం పాడవ్వదు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ దేవాలయంలో అడుగడుగునా మిస్టరీలే. ఈ దేవాలయ భక్తులో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ దేవాలయంలో వేల ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడాదికి ఓ సారే తెరుస్తారు. చిన్న ప్రమిదలో నెయ్యి దీపం పెడతారు. ఏడాదంతా చిన్న నెయ్యి దీపం వెలుగుతూనే ఉంటుంది. అయినా నెయ్యి తరగదు. ప్రసాదం పెడతారు కదా... ఆ ప్రసాదం పాడవ్వదు.
కర్ణాటకలో ఉన్న హాసనాంబ దేవాలయం. దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి రోజున ఆయాలన్ని మూసివేస్తారు. ఆ సమయంలో.. అమ్మవారిని ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు .. మళ్లీ మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు. అయితే అమ్మవారికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఏడు రోజులు తలుపులు తెరిచి నైవేద్యాలు పెడతారు.హాసన్‌లో ఉన్న హాసనాంబ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారు.
హాసనాంబ అమ్మవారి ఆలయంలో ఏడాది మొత్తంలో వెలిగించిన దీపాలు, పూజించిన పువ్వులు, రెండు బస్తాల బియ్యం, నీరు పెట్టి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆలయం తెరిచి చూసేసరికి రెండు బస్తాల అన్నం కూడా వేడి వేడి ...ఆ నెయ్యి దీపాలు వెలుగుతూ ఉన్న కొంచెం కూడా నెయ్యి తరగదు. ఏడాది క్రితం పెట్టిన అన్నం ..వచ్చే యేడాది ప్రసాదం గా ఇస్తారు. చక్కగా అప్పుడే వండినట్లు ఉంటుంది.
హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతారు. దీంతో తన అత్తగారిని బంగారాయిగా మారమని శపించిందట. అత్తగారి బండరాయి ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో కనిపిస్తుంది. అంతేకాదు అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచు హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూ ఉంది. అన్నట్లు గానే ప్రతి ఏడాది దీపావళికి తెరిచినపుడు కొలతలు కూడా తీసుకుంటారు.ఇక్కడ నైవేద్యాలు ప్రెష్ గా ఉండడమే కాదు.. ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయం ఇప్పటికే అనేకమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. సమాధానం దొరకని ప్రశ్న ఇది. కాని భక్తులు హాసనాంబను చాలా నిదర్శనంగా నమ్ముతారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే అన్నానికి లోటుండదని నమ్ముతారు.