India: భారత్ -పాక్ మధ్య కాల్పులవిరమణ తర్వాత డ్రోన్ల గొడవేంటి !

గత నెలలో జరిగిన డ్రోన్ల అమ్మకాలను సంబంధించిన రికార్డులు , కొనగోలుదారులు వివరాలు -కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఉండవచ్చని, అవి దర్యాప్తులో కీలక ఆధారాలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.


Published May 22, 2025 10:57:00 AM
postImages/2025-05-22/1747891703_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ - పాకిస్థాన్ మధ్య కొన్ని రోజుల పాటు కొనసాగిన సైనిక దాడుల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ , సరిహద్దు వెంబడి తర్వాత కలకలం రేగింది. రీసెంట్ నియంత్రణ రేఖ దగ్గర్లో కొన్ని అతి తక్కువ దూరం ప్రయాణించగల చిన్న డ్రోన్లు భద్రతా దళాలకు లభ్యమయ్యాయి. గత నెలలో జరిగిన డ్రోన్ల అమ్మకాలను సంబంధించిన రికార్డులు , కొనగోలుదారులు వివరాలు -కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఉండవచ్చని, అవి దర్యాప్తులో కీలక ఆధారాలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.


ఈ భారీ డ్రోన్లు వైమానిక దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ తన సైనిక దాడి సమయంలో 800నుంచి 1000 డ్రోన్లను మోహరించిందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనర్ సుమేర్ డి' కున్హా ధ్రువీకరించారు. వీటిని భారత వైమానిక దళ సిబ్బంది , రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయని ఆయన తెలిపారు. ఇవి పది కిలోలకు పైగా పేలోడ్లను మోసుకెళ్లగలవని పేర్కొన్నారు. భారత భూభాగంలో వందలాది డ్రోన్ శకలాలు దొరికాయని, ఇది దాడి తీవ్రతను, భారత దళాల వేగవంతమైన, సమర్థవంతమైన ప్రతిఘటనను తెలియజేస్తోందని అధికారులు పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu india pakistan air-fireing

Related Articles