ISRO; ఇస్రో స్పేడెక్స్ డీ- డాకింగ్ సక్సెస్ అంతరిక్ష ప్రయాణంలో భారత్ కు తిరుగులేదు !

చంద్రుడి అన్వేషణ మానవ అంతరిక్షయానం , భారత సొంత స్పేస్ స్టేషన్ ను నిర్మించడానికి వంటి ఇస్రో భవిషత్తు మిషన్లకు మార్గం సుగమం చేస్తుంది.


Published Mar 13, 2025 10:21:00 PM
postImages/2025-03-13/1741884885_21satellite.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ మిషన్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది. ఈ మేరకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో గురువారం స్పేడెక్స్ ( SPADEX) ఉపగ్రహాల డీ -డాకింగ్ పూర్తయినట్లు ప్రకటించింది. ఈ ఘన విజయం చంద్రుడి అన్వేషణ మానవ అంతరిక్షయానం , భారత సొంత స్పేస్ స్టేషన్ ను నిర్మించడానికి వంటి ఇస్రో భవిషత్తు మిషన్లకు మార్గం సుగమం చేస్తుంది.


ఇస్రో సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో పోస్ట్ ద్వారా ISRO బృందాన్ని అభినందించారు. "SpaDeX శాటిలైట్​లు నమ్మశక్యంకాని డీ-డాకింగ్‌ను సాధించాయి. ఇది భారత సొంత స్పేస్ స్టేషన్, చంద్రయాన్ 4, గగన్‌యాన్‌తో సహా ఇస్రో ప్రతిష్టాత్మక భవిష్యత్ మిషన్‌లను సజావుగా నిర్వహించడానికి మార్గం సుగమం చేస్తుంది"అంటూ కేంద్రమంత్రి తెలిపారు.


ఇస్రో స్పేడెక్స్ ప్రయోగం: ఇస్రో 30 డిసెంబర్ 2024న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్​లో శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు.


PSLV-60 ఈ శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ స్పేడెక్స్ మిషన్ ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) రెండు ఉపగ్రహాలు రోదసిలో డాకింగ్‌, అన్‌డాకింగ్‌ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ప్లాన్​ చేశారు. ఇస్రో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ 2025 జనవరి 7 న జరగాల్సి ఉంది. అయితే ఈ మిషన్ లో  సాంకేతిక కారణాలు తలెత్తడంతో డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని అనుకొని ఆ షెడ్యుల్ ను జనవరి 9 కి మార్చినట్లు మొదట ఇస్రో ప్రకటించింది.ఈ ప్రాసెస్ జనవరి 9, 2025 ఉదయం 8:00 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఉపగ్రహాల మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసినట్లు ఇస్రో ప్రకటించింది.


 ఈ ప్రయోగంతో ప్రపంచంలో ఇంత అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nasa india isro

Related Articles