occupying: కబ్జా స్థలానికి సింగరేణి నోటీసులు

 సింగరేణి స్థలంలో చేసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం వరకు తొలగించాలని ఆర్యవైశ్య సంఘానికి ఆదేశాలు జారీ చేశారు.  


Published Sep 17, 2024 02:27:07 PM
postImages/2024-09-17/1726563427_newslinetelugu20240917T142108.690.jpg

న్యూస్ లైన్ డెస్క్: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ సింగరేణి పరిధిలోని స్థలాలను ఆర్యవైశ్య సంఘానికి చెందిన పలువురు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా సింగరేణి స్థలంపై కన్నేయడంతో కబ్జా చేసిన స్థలానికి సోమవారం సాయంత్రం అధికారులు నోటీసులు జారీ చేశారు. సింగరేణి స్థలంలో చేసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం వరకు తొలగించాలని ఆర్యవైశ్య సంఘానికి ఆదేశాలు జారీ చేశారు.  

సభ్యులు తొలగించకుంటే సంస్థ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా ఉండగా ఎస్టేట్, ఎస్ అండ్ పీసీ సిబ్బందిపై అధికార పార్టీకి చెందిన నేత తీవ్రస్థాయిలో మండపడ్డారు. ఈ ఆలయ అక్రమ ప్రహరీ నిర్మాణంలో సింగరేణి అధికారులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. సింగరేణి కబ్జాకు గురవుతున్నా పట్టించుకోకుండా.. కబ్జాదారులకు వత్తాసు పలకడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news singareni assigned-lands

Related Articles