మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన మినప్పప్పు మిశ్రమం, యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఒక కప్పు మినప్పప్పుకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : చాలా మంది ఇష్టపడే ఇండియన్ స్వీట్ సున్నండలు . పైగా వీటి తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు! ఎవరైనా చాలా సింపుల్గా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకుంటే టేస్టీ సున్నండలు రెడీ .
మినప్పప్పు - 2 కప్పులు
పొట్టు మినప్పప్పు - 1 కప్పులు
బియ్యం - 2 టేబుల్స్పూన్లు
యాలకులు - 6
బెల్లం తురుము - 2 కప్పులు
నెయ్యి - తగినంత
ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని మామూలు మినప్పప్పు, పొట్టు మినప్పప్పు రెండింటిని వేసుకొని ఐరన్ కడాయి లో సన్నని సెగతో వేపుకోవాలి.
అలా వేయించుకునేటప్పుడే మధ్యలో బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. బియ్యం కాస్త క్రిస్పీగా ఉండి టేస్టీ గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన మినప్పప్పు మిశ్రమం, యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఒక కప్పు మినప్పప్పుకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి.
ఇప్పుడు కలిపిపెట్టుకున్న పిండిలో ముందుగానే కాచి చల్లార్చుకున్న నెయ్యిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవడానికి వీలుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఓ చిన్న బౌల్ తీసుకొని మీరు చేసిన గుండ్రని సున్నుండలు వాటిలో వేసి తిప్పండి. మంచి షేప్ వస్తుంది. పిల్లలకు బెస్ట్ ప్రొటీన్.