తెలుగు క, ది వారియర్ సినిమాలతో కూడా మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు రెడిన్ కింగ్‌స్లీ.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రీసెంట్ గా తమిళ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్ స్లీ తండ్రి అయ్యారు, కొలమావు కోకిల మూవీతో తమిళ్ తెరకు పరిచయమైన ఈయన ఇఫ్పుడు టాప్ మోస్ట్ కమిడియన్స్ లో ఒకరు. తెలుగు డబ్ లో చాలా సినిమాలు రావడంతో ఇటు తెలుగు తెరకు కూడా బాగా తెలిసిన కమెడియన్. తెలుగు క, ది వారియర్ సినిమాలతో కూడా మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు రెడిన్ కింగ్‌స్లీ.
2023లో తమిళ టీవీ నటి సంగీతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రెడిన్ కింగ్‌స్లీ. అయితే రీసెంట్ గా తల్లి కాబోతున్నట్లు తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. సీమంతం పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట. ఈ జంటకు నిన్నే పండంటి పాప పుట్టింది. తాజాగా సంగీత – రెడిన్ కింగ్‌స్లీ తమ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. పాప ఫేస్ కనపడకుండా రెడిన్ కింగ్‌స్లీ కూతుర్ని ఎత్తుకున్న ఫోటోని షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కూతురు పుట్టినందుకు తనకు చాలా ఆనందంగా ఉందంటు ట్విట్ చేశారు.