Balakrishna: బాలయ్యను 'మాస్' గా మార్చిన చిత్రం.. థియేటర్స్ లో రికార్డులే రికార్డులు.!

నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన 50 సంవత్సరాల  వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సినీ రాజకీయ, ప్రముఖులు


Published Aug 31, 2024 10:37:50 AM
postImages/2024-08-31/1725080870_balakrishna.jpg

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన 50 సంవత్సరాల  వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సినీ రాజకీయ, ప్రముఖులు అంత హాజరవుతున్నారు.  అలాంటి 50 ఏళ్ల సినీ పండగ సందర్భంగా బాలకృష్ణకు ఎంతో పేరు తీసుకొచ్చిన సినిమాలలో ఈ సినిమా చాలా ప్రత్యేకం. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  రౌడీ ఇన్స్పెక్టర్. ఈ చిత్రం ద్వారానే బాలకృష్ణ మాస్ హీరోగా మారారు. ఈ చిత్ర విశేషాలు ఏంటో చూద్దాం..

గోపాల్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం  రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమా 1992లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ముందు గోపాల్ తో 'లారీ డ్రైవర్' సినిమాలో చేశారు బాలయ్య. ఈయన కెరియర్ లో అత్యధిక హిట్ సాధించిన చిత్రాల్లో రౌడీ ఇన్స్పెక్టర్ కూడా ఒకటి. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మాత టీ త్రివిక్రమరావు నిర్మించారు. ఈ చిత్రం ద్వారానే బాలయ్య తన సరికొత్త డైలాగ్ డెలివరీ ని చూపించారు.

మాస్ డైలాగ్ చెబితే బాలకృష్ణనే చెప్పాలి అనే విధంగా పేరు తెచ్చుకున్నారు. బాలయ్య లారీడైవర్ సినిమా కథ రాసిన  ఆంజనేయ పుష్పానంద్ రౌడీ ఇన్స్పెక్టర్ టైటిల్ తో పోలీస్ పాత్రలో కథ స్క్రీన్ ప్లే రాసి  తీసుకువచ్చారట. ఈ కథ అందరికీ నచ్చింది. హీరో ఇంటర్వెల్ తర్వాత  తప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుని సస్పెండ్ అవుతాడు. ఇది పరుచూరి బ్రదర్స్ కు నచ్చలేదు హీరో సస్పెండ్ అయితే సినిమా ఫ్లాప్ అవుతుందని, భావించి చివరి వరకు పోలీస్ పాత్రలో కనిపిస్తూ అన్యాయాలను అక్రమాలను ఎదురుచే హీరోగా చూపించాలని ఆ విధంగానే కథను మార్పించారు.

ఇక బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా విజయశాంతిని ఫిక్స్ చేశారు. సినిమా స్పీడ్ గా షూటింగ్ అయిపోయి 1992లో రిలీజ్ అయి   ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ లిస్టులో చేరింది. ఇక ఇందులో బాలయ్య డైలాగ్స్ మరింత మాస్ గా ఉన్నాయి దీంతో అయినా అప్పటినుంచి మాస్ హీరోగా మాస్ పాత్రలు చేసుకుంటూ వచ్చారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna vijaya-shanti rowdy-inspector b.gopal

Related Articles