తీవ్రమైన చలితో హైపోథెర్మియాతో పాటు ఇమ్మర్షన్, పెర్నియో వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవాలి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చలికాలం మొదలైంది. ఇంకా ఫుల్ గా విశ్వ రూపం చూపించకపోయినా ఈ సారి చలి చంపేస్తుందని మాత్రం చెబుతున్నారు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ..లేదంటే ఫ్లూ లాంటి వ్యాధులు వస్తాయంటుంది ఆరోగ్యశాఖ.
తీవ్రమైన చలితో హైపోథెర్మియాతో పాటు ఇమ్మర్షన్, పెర్నియో వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవాలి. నిజానికి చాలా మందికి చలికాలం అనగానే మూత్రసంబంధిత వ్యాధులు వస్తుంటాయి. దీని కారణం సరైన నీరు తాగకపోవడం వల్ల. చలి కాలం ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోలేరు. దీని వల్ల సరైన ప్రోటీన్ కూడా దొరకదు. ఈ విషయం లో జాగ్రత్త గా ఉండాలి.
గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ప్రస్తుత సీజన్ లో అతి జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గతేడాదులతో పోలిస్తే ఈ ఏడాది చలి ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి నీళ్లు కారటం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. విటమిన్ సీ ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి. చలికాలం మొత్తం సీ విటమిన్ ఫుడ్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ వస్తుంది.
– చలి తీవ్రత దృష్ట్యా ఇంట్లో కర్రలు కాల్చడం వంటి చేయవద్దని హెచ్చరించింది. దీని వల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. బ్రీతింగ్ ఇష్యూస్ తో పాటు ఇప్పటికే ఎయిర్ పొల్యూషన్ చాలా దారుణంగా ఉంది. రానున్న రోజుల్లో 15డిగ్రీలకు వాతావరణం పడిపోయే అవకాశాలున్నాయనే అంచనాలు వేస్తున్నారు. కోల్డ్ వేవ్ నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.