Thug Life: ‘థగ్‌ లైఫ్‌’ మూవీ ట్రైలర్ రిలీజ్ ..కమల్ అదరగొట్టేశాడుగా !

పాన్ ఇండియా సినిమాగా థగ్ లైఫ్ రిలీజ్ చేయనున్నారు


Published May 17, 2025 06:43:00 PM
postImages/2025-05-17/1747487671_thuglife1main1747399236.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కమల్ హాసన్ , మణిరత్నం కాంబోలో వస్తున్న " థగ్ లైఫ్ " సినిమా ట్రైలర్ ను ఆ సినిమా యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో చాలా యాక్షన్ సీన్లతో పాటు సెంటిమెంట్ సీన్లను కూడా చూపారు. గ్యంగ్ స్టర్ డ్రామాగా వస్తున్న ఈసినిమాపై ప్రేక్షకులపై భారీ అంచనాలు ఉన్నాయి. 36 సంవత్సరాల తర్వాత కమల్ , మణిరత్నం కాంబినేషన్ లో సినిమా వస్తుంది.ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ , మద్రాస్ టాకీస్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. జోజు జార్జ్ , గౌతమ్ కార్తీక్ , ఐశ్వర్య లక్ష్మి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పాన్ ఇండియా సినిమాగా థగ్ లైఫ్ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ వచ్చే నెల 5 వ తారీఖున రిలీజ్ చేయనున్నారు.

newsline-whatsapp-channel
Tags : movie-news kamal-haasan a-r-rehman

Related Articles