gold: కొద్ది కొద్దిగా తగ్గుతున్న బంగారం ధర...ఇప్పుడు గ్రాము బంగారం ధర ఎంతంటే !

మరోవైపు వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. 


Published May 02, 2025 01:30:00 PM
postImages/2025-05-02/1746172854_1292823oldd.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ , విజయవాడ, విశాఖపట్టణం తో పాటు చాలా ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే ఈ రోజు బంగారం ధర 24క్యారట్ల బంగారం పై 220 రూపాయిలు తగ్గింది. అదే 22 క్యారట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గింది. గడిచిన పది రోజుల్లో 24క్యారట్ల బంగారంపై రూ. 5,678 తగ్గింది. మరోవైపు వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. 


* తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.87,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,510 వద్ద కొనసాగుతుంది.  అయితే అన్ని ప్రధాన నగరాల్లోను ఇదే ధర నడుస్తుంది. 


 హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. ఇప్పుడు వెండి ధర రూ. 1,09,000 దగ్గరకు చేరుకుంది. ఢిల్లీ , ముంబయి, బెంగుళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 98,000 దగ్గర కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,09,000 దగ్గరకు చేరుకుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business silver-rate gold-rate

Related Articles