పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ కొనుగోలు చేసేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. 30 తారీఖున అక్షయతృతీయ కావడంతో మరింత తగ్గే అవకాశముంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ , విజయవాడ, విశాఖపట్నం తో భారత్ లో బంగారం ధర తగ్గింది. బంగారం కొనాలనుకునేవారికి ఇది ఓ రకంగా శుభవార్తే. ఈ రోజు బంగారం గ్రాము మీద దాదాపు 680 రూపాయిలు తగ్గింది. 22 క్యారట్ల బంగారం ధర 620 తగ్గింది. లక్షదాటిన గోల్డ్ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అక్షయ తృతీయకుతోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ కొనుగోలు చేసేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. 30 తారీఖున అక్షయతృతీయ కావడంతో మరింత తగ్గే అవకాశముంది.
10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 680 తగ్గింది. 22 క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ. 620 తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. అయితే ఇప్పుడు బంగారం ధర రూ. 89,400 కాగా ..24 క్యారట్ల బంగారం ధర రూ.97,530కు చేరుకుంది. భారత్ లో అన్ని సిటీల్లోను బంగారం ధర ఇదే రేటు నడుస్తుంది. కిలో వెండి ధర రూ.1,11,800. అక్షయతృతీయ సంధర్భంగా మరింత తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు ఆర్ధిక నిపుణులు.