GOLD : లక్ష మార్క్ కు దగ్గరగా 10గ్రాముల బంగారం !

శనివారం కిలో వెండి ధర రూ. 97,429 ఉండగా ఆదివారం కూడా రూ. 97,249 గానే ఉంది. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 96, 838 గా ఉంది . 


Published Apr 13, 2025 10:52:00 AM
postImages/2025-04-13/1744521871_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో బంగారం , వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి . శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ. 96,838 ఉండగా ఆదివారం రూ. 96,838 గా ఉంది. శనివారం కిలో వెండి ధర రూ. 97,429 ఉండగా ఆదివారం కూడా రూ. 97,249 గానే ఉంది. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 96, 838 గా ఉంది . 


భారతదేశంలో ఇవాళ్టి వెండి ధర గ్రాము రూ.110లు కాగా, కిలో వెండి ధర రూ.1,10,000లుగా ఉంది. మన దేశంలో మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానిదే హవా నడుస్తోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.


అమెరికా చైనా టారిఫ్ ల గొడవతో మార్కెట్ లో బంగారం పెట్టుబడులు మరింత పెరిగాయి. త్వరలో గోల్డ్‌ రేట్స్‌ దిగి వస్తాయనే ఆశల్లో ఉన్నవారికి షాకిస్తూ పసిడి పరుగులు తీస్తోంది. గత రెండు, మూడు రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అలా దాదాపు ఆరు వేలకు చేరువగా పెరిగి షాకిచ్చాయి. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business gold-rates silver-rate

Related Articles