పెళ్లి మండపంలో ఒక పెళ్లి కొడుకు కూర్చున్నాడు. అదే టైంలో ఓ వ్యక్తి తల మీద కొబ్బరి బొండంను పగలగొడుతున్నాడు. కొబ్బరిబొండంతో అదే పనిగా వరుడి తలపై కొడుతున్నాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది. ఆ ఆచారం ..ఈ ఆచారం అంటూ పెళ్లి మండపాలఅంతా చక్కగా సందడి సందడిగా మారనున్నాయి, అయితే కొన్ని ఆచారాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంతకు ముందు పెద్దగా తెలిసేది కాదు కాని ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియాలో దయ వల్ల అక్కడెక్కడో జరిగిన రోజే ప్రపంచం అంతా చూసేస్తుంది. అయితే ఓ పెళ్లిలో పెళ్లికొడుకు కు చేసిన ఆచారం ఫుల్ వైరల్ అవుతుంది.
పెళ్లి మండపంలో ఒక పెళ్లి కొడుకు కూర్చున్నాడు. అదే టైంలో ఓ వ్యక్తి తల మీద కొబ్బరి బొండంను పగలగొడుతున్నాడు. కొబ్బరిబొండంతో అదే పనిగా వరుడి తలపై కొడుతున్నాడు. అతను కూడా ఏ మాత్రం రియాక్ట్ అవకుండా అలాగే కూర్చొని ఉన్నాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ కొబ్బరి బొండంతో పదే పదే కొడుతూనే ఉన్నాడు. చివరికి కొబ్బరి బొండం పగిలేంత వరకు కొడుతూనే ఉంటారు. చివరకి పెళ్లి కొడుకు తలను కిందికి వంగంతో ఆపుతారు. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్త వైరల్ గా మారింది. ఓరీ దేవుడా పెళ్లి కొడును పెళ్లిలోనే సంపేసేట్లు ఉన్నారంటు కమెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
ఇలాంటి ఆచారాలు గలవాళ్ళని వెతికి వాళ్ళ అమ్మాయిని మన @GoCoronaGo కి ఇచ్చి పెళ్ళి చెయ్యండి @geetha_happy2 @RaniBobba @DEVISireeha pic.twitter.com/IQL5hw5q5S — Satya ™️ (@MSD_Prabhasatya) April 27, 2025