పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు సూచనలు వినిపిస్తున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :భారత్ -పాక్ మాధ్య యుధ్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బోర్డర్ లో యుధ్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రెండు దేశాల సైనికులు అలర్ట్ అయ్యారు. అటు చూస్తే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. భారత్ ను రెచ్చగొట్టేలా కాల్పులు జరుపుతుంది.పహల్గాం ఉగ్రదాడితో యావత్ భారత్ రగిపోతుంది. ప్రతీకారం తీర్చుకోవల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు సూచనలు వినిపిస్తున్నాయి.
దీంతో పీవోకే యంత్రాంగం అలర్ట్ అయ్యింది. స్థానిక ప్రజలకు కీలక సూచన చేసింది. అయితే కశ్మీర్ స్థానిక ప్రాంతాల్లో ప్రజలు రెండు నెలల పాటు ఫుడ్ నిల్వ చేసుకోవాలని పీవోకే యంత్రాంగం అలర్ట్ అయ్యింది. 2 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ వోసీ) సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశారు పీఈవో ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హక్. అలాగే స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.
పహల్గాం ఉగ్రదాడిపై భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి ఆయన సూచించారు. అసలు అది ఒక్కటే ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి సెల్యూషన్ అంటున్నారు. యుధ్ధం కారణంగా అన్ని రేట్లు పెరిగే అవకశాముందని తెలిపారు.